విశాఖ: నకిలీ పత్రాలతో బురిడీ.. రూ.28 లక్షలు కాజేశాడు

8చూసినవారు
విశాఖ: నకిలీ పత్రాలతో బురిడీ.. రూ.28 లక్షలు కాజేశాడు
పెందుర్తిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఒడిశాకు చెందిన నబీనా బాఘాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ప్రసాద్ బాబుకు నకిలీ పత్రాలు చూపించి స్థలం అమ్ముతానని నమ్మించి రూ.28 లక్షలు కాజేసినట్లు ఆదివారం తెలిపారు. ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు SI భాస్కరరావు బృందం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించింది. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్