విశాఖ నగర అభివృద్ధి మరియు పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ జోన్లను పునర్వస్తీకరించినట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 1 నుండి 8 జోన్లను 10 జోన్లుగా విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, గురువారం ఆయన స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పెందుర్తి జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పునర్వస్తీకరణ కూటమి ప్రభుత్వ పరిపాలనను మెరుగుపరుస్తుందని మేయర్ పేర్కొన్నారు.