
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లో ఈత, స్నానం నిషేధం
విశాఖ జిల్లాలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లో ఈత, స్నానం చేయడం పూర్తిగా నిషేధమని పెందుర్తి పోలీసులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాపాయాన్ని తెచ్చుకోరాదని హెచ్చరించారు. రిజర్వాయర్ వద్ద 24 గంటలు పోలీసుల నిఘా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.





































