
టీడీపీ అండతో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అనారోగ్యం, ప్రమాదాలతో బాధపడుతున్న సాలాపు సన్యాసమ్మ, గవర పైడిరాజు, గొడ్డి అప్పలరాజులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ గండి బాబ్జి వీరి సమస్యలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అవసరమైన పత్రాలను అందజేసి, అతి తక్కువ సమయంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు. ఈ నిధులను పెందుర్తి పార్టీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. బాధితులకు రూ. 69,500, రూ. 59,000, రూ. 35,000 చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయబడింది. ఈ సహాయానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, శ్రీ గండి బాబ్జిలకు కృతజ్ఞతలు తెలిపారు.





































