రంపచోడవరం - Rampachodavaram

లక్కవరం పాఠశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం: విద్యార్థుల ప్రగతిపై చర్చ

లక్కవరం పాఠశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం: విద్యార్థుల ప్రగతిపై చర్చ

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, లక్కవరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం (డిసెంబర్ 5, 2025) తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (PTM 3.0) జరిగింది. ఉపాధ్యాయురాలు అరుణ ప్రతి విద్యార్థి ప్రగతి నివేదికను తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల చదువులో మెరుగుదలకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవితకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం అవసరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
నాగర్ కర్నూల్: సరిహద్దు చెక్ పోస్ట్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ
Dec 06, 2025, 03:12 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్: సరిహద్దు చెక్ పోస్ట్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Dec 06, 2025, 03:12 IST
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరులో ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ డాక్టర్. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏవిధమైన రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని ఆదేశించారు.