రాజవొమ్మంగి మండలంలోని వట్టిగడ్డ గ్రామదేవత పట్టాలమ్మ ఆలయ ప్రాంగణంలో గురువారం 168 మంది ఆదివాసీ జంటలకు వైదిక విధానంలో, శాస్త్రోక్తంగా సామూహిక వివాహాలు జరిగాయి. చిన్న జీయర్ స్వామితో పాటు హాజరైన ఆధ్యాత్మిక స్వాములు వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.