రంపచోడవరం గోకవరం రహదారిలో రామన్నపాలెం గ్రామ సమీపంలో గురువారం ఉదయం భారీ వృక్షాలు కూలిపోవడంతో సుమారు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనితో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయి, ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని చెట్లను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.