రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలి

5చూసినవారు
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలి
పోలవరం నిర్వాసితులు, గిరిజన ప్రజల అభ్యున్నతి కోసం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. చింతూరులో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టాలని కోరారు. రంపచోడవరం, చింతూరు, పోలవరం డివిజన్లను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తేనే గిరిజన ప్రాంత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలపాలనే మంత్రుల బృందం ఆలోచనను ఆయన దుర్మార్గమని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్