వడ్డే ఓబన్న కు ఘన నివాళి

5చూసినవారు
వడ్డే ఓబన్న కు ఘన నివాళి
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ ఆదివారం మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన స్వర్గీయ వడ్డే ఓబన్నను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో వడ్డే ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వడ్డే ఓబన్న 1807 జనవరి 11న జన్మించి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1846 లో జగన్నాథ కొండ యుద్ధంలో వీరమరణం పొందారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్