కల్లు అనుకుని పురుగు మందు తాగి యువకుడు మృతి

840చూసినవారు
కల్లు అనుకుని పురుగు మందు తాగి యువకుడు మృతి
చింతూరు మండలంలో కల్లు అనుకుని పురుగు మందు తాగి టి.బుద్ధరాజు (16) అనే యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సురకుంట గ్రామానికి చెందిన బుద్ధరాజు మద్యం మత్తులో ఇంటి వద్ద పురుగు మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని, తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్ననాటి నుంచి నానమ్మ వద్దే ఉంటున్నాడని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్