అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మండల ద్వితీయ స్థానాన్ని వాసా నదీప్, తృతీయ స్థానాన్ని మఠం జేసికరాణి సాధించారు. ఈ ఏడాది మండలంలో 452 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 352 మంది ఉత్తీర్ణత సాధించారు. గిరిజన సంక్షేమ అధికారులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.