పెద్దపులి పంజా.. 7 దూడలు బలి

8చూసినవారు
రాజవొమ్మంగి మండలంలో మంగళవారం రాత్రి పెద్దపులి మరోసారి తన ప్రతాపం చూపింది. చికిలింత, పెద్ద రెల్లంగిపాడు గ్రామాల్లోని పొలాల్లో కట్టేసి ఉంచిన ఏడు దూడలను పులి బలిగొంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పొలాల్లో సంచరించిన పులి దూడలపై దాడి చేసి చంపేసినట్లు రైతులు తెలిపారు. ఒకేసారి ఏడు పశువులు పులి దాడిలో మృతిచెందడం ఇదే తొలిసారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్