పోలీస్ అమరవీరుల ముగింపు రోజు సందర్భంగా రక్తదాన శిబిరం

9చూసినవారు
పోలీస్ అమరవీరుల ముగింపు రోజు సందర్భంగా రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల ముగింపు రోజు సందర్భంగా, రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. డీఎస్పీ స్వయంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ రక్తదానం ద్వారా ఇతరులకు ప్రాణదాతలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ శిబిరంలో పోలీసులు, పాత్రికేయులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్