మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో గాంధీ పేరు తొలగించాలనే కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై దాడి అని, గిరిజన, గ్రామీణ సమాజానికి భారీ ముప్పు అని ఆమె అన్నారు. పేరుమార్పుతో ప్రజాధనం వేల కోట్ల రూపాయలు వృథా అవుతుందని, ఉపాధి హక్కు బలహీనపడే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. గాంధీ, అంబేద్కర్ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.