మొంథా తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీష దేవి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆమె తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పెద్ద భీంపల్లి, ఇందుకూరుపేట గ్రామాల్లో పర్యటించి, మినుము పంటలు దెబ్బతిన్న పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.