
పవన్ సభకు అనుమతి ఇస్తే వివాదమే ఉండేది కాదు: బీజేపీ చీఫ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో సమావేశాలు నిర్వహించుకునే హక్కు అందరికీ ఉంటుందని, ముందే అనుమతి ఇచ్చి ఉంటే ఈ వివాదమే తలెత్తేది కాదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయికను చూసి కొందరు ఓర్వలేక తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.




