చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఏక్సిస్ పాయింట్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ సహకారంతో, ప్రధానమంత్రి ఉచ్చతార్ అభియాన్ స్కీమ్ ఆర్థిక సహాయంతో కంప్యూటర్ అక్షరాస్యతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ ఎన్. ఆనంద్, రాపాక కిరణ్మయి కంప్యూటర్ విద్య ప్రాముఖ్యతను, ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాల ఆవశ్యకతను వివరించారు. ఈ సదస్సు విద్యార్థులకు డిజిటల్ యుగంలో రాణించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించింది.