ఎటపాక నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు గురువారంతో గడువు ముగియనుంది. ప్రిన్సిపల్ ప్రసాద్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 80 సీట్లకు గాను మొదటి కౌన్సిలింగ్‌లో 67 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. మిగిలిన 13 సీట్ల భర్తీకి రేపటితో గడువు ముగుస్తుంది. ప్రవేశం కోరే అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని, చేరేందుకు ఆసక్తి లేనివారు లేఖ ద్వారా తెలియజేయాలని సూచించారు.