నల్లరాయి క్వారీలకు వ్యతిరేకంగా రంపచోడవరంలో ధర్నా

8చూసినవారు
నరసాపురం నల్లరాయి క్వారీల వల్ల పంట పొలాలు, నివాస గృహాలు నష్టపోతున్నాయని, బాంబు బ్లాస్టింగ్ కారణంగా ఆస్తి నష్టం, పర్యావరణ కాలుష్యం జరుగుతోందని బాధితులు ఆరోపించారు. ఎనిమిది నెలలుగా సాగుతున్న పోరాటాన్ని అణచివేయడానికి మైనింగ్ మాఫియా, స్థానిక రెవెన్యూ, మైనింగ్, పోలీస్ విభాగాలు కలిసి ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులపై దాడులు చేయించి, బాధితులపైనే కేసులు పెట్టారని ఆందోళకులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you