చింతూరులో తాగునీటి ఎద్దడి

1చూసినవారు
చింతూరులో తాగునీటి ఎద్దడి
చింతూరు డివిజన్ కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. మండల కేంద్రంలోని బీసీ, ఎస్టీ కాలనీలు, గుబేలుపేటలో కుళాయిలకు నీరు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి ఏర్పాట్లకు నిధులు విడుదలవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని, రూ. 2 వేల చొప్పున చెల్లించి కనెక్షన్లు తీసుకున్నా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you