శనివారం రాత్రి రాజవొమ్మంగి మండలంలోని దూసరపాము, కొండపల్లి, శరభవరం, జడ్డంగి, వట్టిగడ్డ తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వీధుల్లోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు ఇబ్బందులు పడ్డారు.