ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు, తరచూ ప్రకటించే బంద్‌ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా చింతూరు గ్రామ ప్రజలు, విద్యార్థి సంఘాలు సంయుక్త ధర్నా నిర్వహించారు. 'మావోయిస్టులు మాకు వద్దు' నినాదాలతో జరిగిన ఈ నిరసనలో, మావోయిస్టులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, బంద్‌ల వల్ల విద్యార్థులు, రోజువారీ కార్మికులు, రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.