అడ్డతీగలలో మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహణ

7చూసినవారు
అడ్డతీగలలో మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహణ
అడ్డతీగల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. రాష్ట్ర ఏపీసీసీ కార్యదర్శి దంగేటి సత్తిబాబు గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, అహింస, సత్యాగ్రహ మార్గాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీని కొనియాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి ఆయన పేరును తొలగించడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃస్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్