రాజవొమ్మంగి మండల కేంద్రంలో మే డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్మిక హక్కుల కోసం పోరాట విజయానికి గుర్తింపుగా ఈ రోజును జరుపుకుంటున్నామని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామరావు అన్నారు. మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి. రామరాజు, టి. శ్రీనివాస్, ఎస్. అచ్చారావు, కె. వెంకటలక్ష్మి, చిన్ని కుమారి, అంగన్వాడీ వర్కర్స్, అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారు.