సోమవారం రాజవొమ్మంగి మండలంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 3.0 కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తారు. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నామినేటెడ్ పదవుల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు.