విద్యార్థుల యోగక్షేమాలపై అశ్రద్ధ సహించను ఎమ్మెల్యే

2చూసినవారు
విద్యార్థుల యోగక్షేమాలపై అశ్రద్ధ సహించను ఎమ్మెల్యే
రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల యోగక్షేమాలపై యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, సమస్యలపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఇటీవల అదృశ్యమైన 8వ తరగతి విద్యార్థిని సురక్షితంగా తిరిగి వచ్చిందని నిర్ధారించారు. వసతిగృహాలు, వంటశాల, ఆహారపట్టిక, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్పందించని యాజమాన్యంపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్