అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి మండలం పరిధిలోని వనకరాయి, కిర్రాబు, తాళ్లపాలెం, కిండ్ర గ్రామాల్లో జరుగుతున్న జలహారతి పనులను ఎంపిడిఓ లోకుల యాదగిరేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.