గిరిజన సదస్సుపై అభ్యంతరం

5చూసినవారు
గిరిజన సదస్సుపై అభ్యంతరం
జీవో నంబర్ 3 రద్దుతో ఆదివాసి యువత నిరుద్యోగులయ్యారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఉమ్మడి ఏఎస్సార్ జిల్లా చైర్మన్ రామారావు దొర ఆరోపించారు. ఈ నెల 12న రంపచోడవరం పీఆర్ ఫంక్షన్ హాల్లో జరగనున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి సదస్సుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజన చట్టాలు, సంస్కృతి అంశాలపై మాట్లాడే నైతిక హక్కు యూటీఎఫ్‌కు లేదని, జీవో 3 కేసులో నాన్-ట్రైబల్ వర్గాలకు యూటీఎఫ్ మద్దతిచ్చిందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్