రాజవొమ్మంగిలో రూ.110కే లీటర్ పెట్రోల్: వాహనదారుల హర్షం

1266చూసినవారు
రాజవొమ్మంగిలో రూ.110కే లీటర్ పెట్రోల్: వాహనదారుల హర్షం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి మండల కేంద్రంలో జి.సి.సి సూపర్ బజారు వద్ద రెవిన్యూ అధికారుల సహకారంతో పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అకౌంటెంట్ మాతయ్యమ్మ తెలిపిన వివరాల ప్రకారం, లీటర్ పెట్రోల్ ధర రూ. 110గా నిర్ణయించారు. జి.సి.సి మేనేజర్ గౌరమ్మ, వీఆర్వో గొర్లె సూర్యకాంతం పర్యవేక్షణలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ చర్యతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తూ రెవిన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏర్పాటు వాహనదారులకు ఊరటనిచ్చింది.

సంబంధిత పోస్ట్