పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని కలెక్టర్‌కు వినతి

1035చూసినవారు
పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని కలెక్టర్‌కు వినతి
రాజవొమ్మంగి మండలంలో 516 జాతీయ రహదారిపై పశువుల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి, గేదెలు, ఆవుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని మండల టిడిపి అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కోరారు. సోమవారం రంపచోడవరం ప్రజావాణిలో ఆయన ఈ మేరకు అర్జీని సమర్పించారు. రాజవొమ్మంగి పంచాయితీలో శాంతినగర్ బ్రిడ్జి, అంగన్వాడీ భవనాలు, రోడ్ల సమస్యలపై కూడా మరొక అర్జీని అందించినట్లు పెద్దిరాజు తెలిపారు. ఈ చర్యలు రోడ్డు భద్రతను మెరుగుపరుస్తాయని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్