ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కాదు
Jun 13, 2026, 01:06 IST/

భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కాదు

Jun 13, 2026, 01:06 IST
దాంపత్య జీవితంలో చిన్న చిన్న కలహాల వల్ల భార్యాభర్తలు కొన్నాళ్లు మాట్లాడుకోకపోవడం సహజమని, కేవలం 13 రోజులు భార్యతో మాట్లాడకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహ హింస చట్టం కింద భర్తకు విధించిన శిక్షను రద్దు చేసి, పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒమన్‌లో ఉన్న భర్త 13 రోజుల పాటు అలకవహించడం వల్లే పుట్టింట్లో ఉన్న భార్య ఆత్మహత్యకు పాల్పడిందన్న ప్రాసిక్యూషన్‌ వాదనను తిరస్కరించింది. వారిద్దరి మధ్య వాట్సప్‌ సందేశాలు కూడా లేవని చెబుతూ దానిని సాక్ష్యంగా చూపటాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.