మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యలు ముమ్మరం

4చూసినవారు
డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, మారేడుమిల్లి మండలంలో ముమ్మర వాహన తనిఖీలు, విస్తృత స్థాయిలో కూంబింగ్ చేపట్టినట్లు మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. గోపి నరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎస్పీ అమిత్ బర్ధర్, ఓఎస్‌డీ ఆపరేషన్స్, రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూచించారు.

ట్యాగ్స్ :