మారేడుమిల్లి CSI చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

1387చూసినవారు
23-11-2025 ఆదివారం నాడు మారేడుమిల్లి CSI చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్ట్రెట్ చైర్మన్ ch. శుభకర రావు మాట్లాడుతూ, పొరుగువారిని ప్రేమించాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఈ వేడుకలలో దేవుని పాటలు, నాటికలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాస్ట్రెట్ సెక్రటరీ కోరా అజిత్, ట్రెజరర్ దూడ ఫీబే, సంఘ పెద్దలు, వైస్ ఎంపీపీ రవికుమార్, మాజీ ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :