
ఆరు నెలల కూతురితో కలిసి ఆరో అంతస్తు నుంచి దూకిన తల్లి
TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మయూరి నగర్‌కు చెందిన ఈషా సాహు (37) అనే మహిళ తన ఆరు నెలల కూతురితో కలిసి అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, స్వల్పగాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.




