డ్రోన్ కెమెరాతో పులి కదలికలపై నిఘా

9చూసినవారు
దేవీపట్నం మండలంలోని పోతవరం గ్రామ సమీపంలో పులి సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో పరిశీలనలు చేపట్టారు. మత్తు ఇంజక్షన్ అందించే నిపుణుల బృందాన్ని కూడా వెంట తీసుకువెళ్లారు. డ్రోన్ ద్వారా అనుమానిత ప్రాంతాలను పరిశీలిస్తూ పులి జాడను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్