అక్కడ సంచరించిన పెద్దపులి

100చూసినవారు
అక్కడ సంచరించిన పెద్దపులి
అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గంగవరం మండలం గోరగోమ్మి, లక్కొండ గ్రామాల మధ్య పులి సంచరించిందని సబ్ DFO తెలిపారు. బుధవారం అటవీ సిబ్బందితో కలిసి పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. రెండు గ్రామాల మధ్య కాలిబాట గుండా ప్రయాణించి, సమీప వాగు వద్దకు వచ్చినట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్