దేవీపట్నం మండలం గొందురులో స్వయంభువంగా వెలసిన మాతృశ్రీ గండిపొశమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రయత్నాలతో ఈ విషయం నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లింది. టూరిజం మినిష్టర్ కందుల దుర్గేష్ కూడా ఆలయాన్ని సందర్శించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గిరిజనులకు జీవనోపాధి కలుగుతుందని ఆయన అన్నారు.