దాడి కేసులో ముగ్గురు అరెస్ట్ రిమాండ్‌కు తరలింపు

10చూసినవారు
పోలవరం జిల్లా రాజవొమ్మంగి పరిధిలో దాట్ల వెంకటేశు రాజు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మిపై జరిగిన దాడి కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీ రాత్రి కిండ్ర జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ గౌరీశంకర్, ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు, 29న అంబటి అఖిల్ బాబు, కొమ్ముల జోహిరామ్స్, చిడిపి వెంకటేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాయి. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్