దేవీపట్నం మండలం గంగంపాలెం, దండంగి ప్రాంతాల్లో 13 ఆవు దూడలను చంపిన పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజల భద్రత దృష్ట్యా, గండి పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలో పోతవరం వద్ద చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. ఆ ప్రాంతం వైపు ప్రజలు, వాహనాలు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.