రంపచోడవరం మండలం పోక్స్‌పేట పంచాయతీ పరిధిలోని కన్నవరం, బూరుగుబంద, కొత్తవీధి ప్రాంతాల్లో పెద్దపులి పశువులపై దాడులు చేస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవులకు హాని కలిగితే పరిస్థితి ఏమిటని భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనులు ప్రాణాలతో చలగాటమాడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకుడు కారం సురేష్‌బాబు డిమాండ్ చేశారు.