వ్యవసాయ పనుల్లో బిజీగా గిరిజన రైతులు

13చూసినవారు
మన్యంలోని గ్రామాల్లో గిరిజన రైతులు ఖరీఫ్ సాగు పనులను ప్రారంభించారు. ఇటీవల కురుస్తున్న విస్తారమైన వర్షాలతో వాగులు, వంకలు జలకళ సంతరించుకోవడంతో పొలాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు దుక్కులు దున్నుతూ భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారు. వరి, మక్క, చిరుధాన్యాల సాగుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేసేందుకు రైతులు ముందుకు సాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్