ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు కొండ మామిడి పండ్ల సేకరణలో నిమగ్నమయ్యారు. డుంబ్రిగూడ మండలంలోని పోతంగి పంచాయతీ గ్రామాలతో పాటు మండల వ్యాప్తంగా గిరిజనులు సమీప కొండలకు వెళ్లి మామిడి పండ్లను సేకరిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే మామిడి పండ్లతో పోలిస్తే కొండ మామిడి పండ్లు పరిమాణంలో చిన్నగా, రుచిగా ఉంటాయి. సేకరించిన పండ్లతో గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో మామిడి తాండ్ర తయారు చేస్తారు.