
క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్.. రూ.7 కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో
హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ క్రెడిట్ కార్డు నుంచి 6,90,000 డాలర్లు (సుమారు 7 కోట్ల రూపాయలు) దొంగిలించిన హంగేరియన్ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు 308 లావాదేవీల ద్వారా ఈ మోసానికి పాల్పడిన నిందితుడు, చిన్న మొత్తాలలో డబ్బును వాడి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. బ్యాంకు అధికారులు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి, క్రెడిట్ కార్డును ఫ్రీజ్ చేసి, ఎఫ్‌బీఐకి సమాచారం అందించడంతో దర్యాప్తు ప్రారంభమైంది. డిజిటల్ ఆధారాలతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




