వంచంగిలో ఆలయ వార్షికోత్సవం: ప్రత్యేక పూజలు, అన్నదానం

1446చూసినవారు
వంచంగిలో ఆలయ వార్షికోత్సవం: ప్రత్యేక పూజలు, అన్నదానం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం వంచంగి పంచాయితీ జి. కొత్తపల్లి గ్రామంలో గురువారం వినాయకుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాల రెండో వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గోము సత్తిబాబు, కొచ్చా ఎర్రయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అభిషేకాలు, భజనలు, కొళాటం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు ఐక్యంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొర్రాబు సత్యనారాయణ రెడ్డి, కొర్రాబు శ్రీను, కోసూరి బాబ్జి, జర్తా వెంకట్రావు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్