
కళాశాల లో సంక్రాంతి సంబరాలు
గురువారం చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా, ప్రిన్సిపాల్ కే. రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ కే. గణేశ్వర రావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కుంజా కల్యాణి మొదటి బహుమతి, పి. సాయి మేఘన ద్వితీయ, శ్వేత తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.






































