
ఎస్టి కమిషన్ చైర్మన్ కు సమస్య వివరించిన సీఆర్పీ ల నాయకులు
జిల్లా సిఆర్టి యూనియన్ నాయకులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాబోయే డీఎస్సీలో ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్టి పోస్టులను మినహాయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ విషయంపై స్పందించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని జిల్లా సిఆర్టి యూనియన్ అధ్యక్షుడు శారపు కృష్ణమూర్తి దొర తెలిపారు.








































