Apr 09, 2026, 18:04 IST/
రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు!
Apr 09, 2026, 18:04 IST
తెలంగాణలో రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవాలని సూచించింది. 'దాహం వేయకపోయినా ప్రతిరోజూ సరిపడా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ORSతో పాటు ఇంట్లో తయారుచేసిన నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఎండలో కష్టమైన పనులు చేయడం మానుకోవాలి' అని సూచించింది.