Dec 10, 2025, 01:12 IST/
రబ్బరు డ్యాం: 20 ఏళ్లుగా 25 వేల ఎకరాలకు జీవం
Dec 10, 2025, 01:12 IST
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం సమీపంలో జంఝావతి నదిపై ఉన్న రబ్బరు డ్యాం, సుమారు 20 ఏళ్లుగా 25 వేల ఎకరాలకు సాగునీరందిస్తూ ఇంజినీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. 2005లో రూ.124 కోట్లతో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ డ్యాం, ఆసియాలోనే తొలి రబ్బరు డ్యాంగా రికార్డు సృష్టించింది. ఒడిశా ప్రభుత్వం అభ్యంతరాలతో జంఝావతి ప్రాజెక్టుకు బదులుగా ఈ రబ్బరు డ్యాం ఆలోచన రూపుదిద్దుకుంది.