Mar 07, 2026, 18:03 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
జీడిమెట్ల సిగ్నల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
Mar 07, 2026, 18:03 IST
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు గండి మైసమ్మ సిగ్నల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు శనివారం చేపట్టారు. ట్రాఫిక్ సీఐ నరసింహారావు, ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారికి భారీ జరిమానాలు, కోర్టు చలాన్లు, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.