పాయకరావుపేట సీఐ అప్పన్న బదిలీ, శంకరరావు కొత్త బాధ్యతలు స్వీకారం

744చూసినవారు
పాయకరావుపేట సీఐ అప్పన్న బదిలీ, శంకరరావు కొత్త బాధ్యతలు స్వీకారం
విశాఖపట్నం రేంజ్, డిఐజి కార్యాలయం ఉత్తర్వుల మేరకు పాయకరావుపేట సీఐ గంటలాన అప్పన్న బదిలీ అయ్యారు. సెప్టెంబర్ 4, 2024న నక్కపల్లి నుంచి పాయకరావుపేట వచ్చిన అప్పన్న, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన స్థానంలో సాకేటి శంకరరావును కొత్త సీఐగా నియమించారు. శంకరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్